ప్రభుత్వ తీరుపై నిరుద్యోగుల నిరసన | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ తీరుపై నిరుద్యోగుల నిరసన

Jul 22 2026 12:24 AM | Updated on Jul 22 2026 12:24 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన 11,639 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని, లేని పక్షంలో నిరుద్యోగులతో కలిసి చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న అన్నారు. కాకినాడలో నిరుద్యోగులు మంగళవారం డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కొండయ్యపాలెం బ్రిడ్జి నుంచి జెడ్పీ సెంటర్‌ మీదుగా కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న చంద్రబాబు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఖాళీలతో సంబంధం లేకుండా కేవలం 2500 పోస్టులతో నోటిఫికేషన్‌ ఇవ్వడానికి సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. కనీసం పది వేల పోస్టులతో కూడిన నోటిఫికేషన్‌ విడుదల చేయాలని చేశారు. డిగ్రీ, పిజీలు చదివిన వారికి ఒక్క ఉద్యోగం లేదని, కానీ ఇంటర్‌ ఫెయిల్‌ అయిన వారు మూడు, నాలుగు శాఖలకు మంత్రులుగా ఉన్న పరిస్థితి మన రాష్ట్రంలో ఉందన్నారు. అనంతరం కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నాయకులు టి.రాజా, వాసు, సత్యం, జయరాం, ఆదర్శ కార్తిక్‌, రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement