రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు

Jul 21 2026 12:35 AM | Updated on Jul 21 2026 12:35 AM

పిఠాపురం రూరల్‌: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని వైఎస్సార్‌ సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినీడు సుజాత సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరులో వాటర్‌ బోర్‌ మోటార్‌ పంపు విషయంలో రూ.10 వేల లంచం ఇవ్వలేదనే కారణంతో టీడీపీ వార్డు సెక్రటరీ మల్లేల మూర్తి, అతని కుటుంబ సభ్యులు ఓ మహిళను వివస్త్రను చేసి నడిరోడ్డుపై దాడి చేసిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. కావలిలో గిరిజన మహిళలను టీడీపీ కౌన్సిలర్‌ వివస్త్రను చేసి కొట్టిన ఘటన మరువక ముందే మరో ఘటన జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. తొండంగి మండలం కొమరగిరి పంచాయతీ వడపంపాదిపేటలో రాజేంద్ర అనే యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేయడంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కూడా మహిళలపై పెరుగుతున్న వేధింపులకు నిదర్శనమని తెలిపారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఈ ఘటనలపై బాధ్యత వహించి తక్షణం చర్యలు తీసుకోవాలని అన్నారు.

నేడు కాకినాడలో నిరసన

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వర్ధినీడి సుజాత మండిపడ్డారు. ప్రభుత్వ చేతకానితనానికి, నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా కాకినాడలోని కలెక్టరేట్‌ సమీపంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మంగళవారం ఉదయం 9 గంటలకు నిరసన చేపడతామన్నారు.

ఫ మహిళలపై పెరిగిన అఘాయిత్యాలు

ఫ వైఎస్సార్‌ సీపీ జిల్లా

మహిళా అధ్యక్షురాలు సుజాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement