ముద్రగడ గిరిబాబు, బాలును
పరామర్శిస్తున్న ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్
ముద్రగడ సతీమణి పద్మావతిని
పరామర్శిస్తున్న వంగవీటి ఆశాకిరణ్
కిర్లంపూడి: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం మరణం తీరని లోటని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక ఆయన నివాసానికి మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు, వంగవీటి మోహన్‌రంగ కుమార్తె ఆశాకిరణ్, తణుకు ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పొన్నాడ సతీష్, పితాని, బాలకృష్ణ, తన్నీరు నాగేశ్వరరావు కిర్లంపూడి దళిత పేట నుంచి మహిళలు, దళిత నాయకులు, జిల్లా నలుమూలల నుంచి ఆయన అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి ముద్రగడ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయన కుమారులు వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబును, పెద్ద కుమారుడు వీరరాఘవరావు (బాలు)ను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.


