మన కాయర్ ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైనది. మొత్తం శ్రీలంకలో ఒక రోజు ఉత్పత్తి అయ్యే కాయర్, తమిళనాడులోని పొలార్చిలో ఉత్పత్తి అయ్యే కాయర్‌కు సమానం. విలువ ఆధారిత ఉత్పత్తులకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంది. కాయర్ నుంచి 6 వేల విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసే అవకాశముంది.
– ఎస్‌కే గౌతమ్, కాయర్ కన్సల్టెంట్, యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం, కోయంబత్తూర్
బ్రాండ్ కోనసీమతోనే అంతర్జాతీయ డిమాండ్
బ్రాండ్ కోనసీమను విస్తృతం చేస్తేనే జాతీయ, అంతర్జాతీయ డిమాండ్ సాధ్యం. ఇక్కడ తయారయ్యే కాయర్ ఉత్పత్తులకు ఆ స్థాయి నాణ్యత ఉండాలి. ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడినిచ్చే కొబ్బరి రకాలను రైతులు పండించాలి. ఉత్పత్తిదారుకు, ఉత్పత్తికి మధ్య ఉన్న అతి పెద్ద అంతరాన్ని ప్రభుత్వాలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. – టీఎల్‌ఎన్ రావు, సైంటిస్ట్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్


