ఇండియా రికార్డ్స్‌లో ‘వేదాన్షి’కి స్థానం! | - | Sakshi
Sakshi News home page

ఇండియా రికార్డ్స్‌లో ‘వేదాన్షి’కి స్థానం!

Jul 28 2023 2:06 AM | Updated on Jul 28 2023 1:42 PM

- - Sakshi

కాకినాడ: రౌతులపూడి మండలంలోని ములగపూడి గ్రామానికి చెందిన యామల గజ్జన్నదొర, వరలక్ష్మి దంపతుల రెండున్నరేళ్ల కుమార్తె ‘వేదాన్షి’కి ఇండియా రికార్డ్స్‌–2023లో స్థానం లభించింది. ఈ విషయాన్ని చిన్నారి తండ్రి గజన్నదొర గురువారం విలేకర్లకు తెలిపారు.

అతి చిన్న వయస్సులో జంతువులు, పండ్లు, కూరగాయలు, వాహనాలు, రంగులు, ఆకారాలు, శరీర అవయవాలు వంటి 26 రకాల పేర్లను సులభంగా గుర్తించి, పలకడంతో ఆమెకు ఇండియా రికార్‌ుడ్సలో స్థానం లభించినట్టు వివరించారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి అవార్డును కొరియర్‌ ద్వారా అందుకున్నట్లు తెలిపారు. ఇండియా రికార్డ్స్‌లో స్థానం సాధించిన వేదాన్షి, ఆమె తల్లిదండ్రులను పలువురు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement