కిక్కిరిసిన లోవ | - | Sakshi
Sakshi News home page

కిక్కిరిసిన లోవ

Jul 13 2026 12:16 AM | Updated on Jul 13 2026 12:16 AM

తుని రూరల్‌: తలుపులమ్మ లోవ దేవస్థానం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు లోవకు భక్తులు వస్తూనే ఉన్నారు. క్యూలైన్ల ద్వారా 32 వేల మంది భక్తులు దర్శించుకున్నట్టు ఈఓ పి.విశ్వనాథరాజు తెలిపారు. పులిహోర, లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.3,14,520, పూజా టికెట్లకు రూ.6,86,342, తలనీలాలకు రూ.26,760, వాహన పూజలకు రూ.29,224, వసతి గదుల అద్దెలుగా రూ.1,02,630, విరాళాలుగా రూ.37,542, ఆశీర్వచనం రూ.16,740లు వెరసి మొత్తం రూ.1,21,3758 ఆదాయం సమకూరిందన్నారు. కాగా ఈ నెల 15 నుంచి ఆషాఢ మాసోత్సవాలు ప్రారంభమై ఆగస్టు 14తో ముగుస్తాయి.

అయినవిల్లికి

పోటెత్తిన భక్తులు

అయినవిల్లి: విఘ్నాలను తొలగించే అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారు జామునే స్వామివారికి మేలుకొలుపు సేవ తదితర పూజలు చేశారు. 41 మంది లఘున్యాస అభిషేకాలు, ముగ్గురు భక్తులు స్వామికి ఉండాళ్ల పూజ, 24 మంది శ్రీలక్ష్మీగణపతి హోమం, ఇద్దరు చిన్నారులకు అన్నప్రశన, ఐదుగురికి తులాభారం, ఏడుగురికి అక్షరాభ్యాసం నిర్వహించారు. 40 మంది నూతన వాహన పూజలు చేయించుకున్నారు. 2,352 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయానికి ఈ ఒక్కరోజు రూ.3,92,731 ఆదాయం సమకూరిందని ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.

కోరింగ

అభయారణ్యంలో స్టడీ టూర్‌

తాళ్లరేవు: ప్రముఖ పర్యాటక ప్రాంతం కోరింగ అభయారణ్యాన్ని కాకినాడ ఏపీఎస్‌పీ థర్డ్‌ బెటాలియన్‌లో శిక్షణ పొందుతున్న సుమారు 350 పోలీస్‌ ట్రైనీస్‌ ఆదివారం సందర్శించారు. స్టడీ టూర్‌లో భాగంగా అసిస్టెంట్‌ కమాండెంట్‌ గంగరాజు ఆధ్వర్యంలో కోరింగ ఎకో టూరిజానికి సంబంధించి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఫారెస్ట్‌ రేంజర్‌ ఎస్‌ఎస్‌ఆర్‌ వరప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మడ అడవుల ప్రయోజనాలు, ఎకో టూరిజం ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల నుంచి తీర ప్రాంతాన్ని మడ అడవులు ఏ విధంగా కాపాడుతున్నాయనే అంశాలను అటవీ సిబ్బంది తెలిపారు. సెక్షన్‌ అధికారి కె.సిద్ధార్థ, ఎఫ్‌బీఓలు గోపి నాగేంద్రకుమార్‌, ఽకె.మహేష్‌, కె.ధనుంజయరావు తదితరులు పాల్గొన్నారు.

కోట్లాది హృదయ

సామ్రాజ్ఞి జానకి

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): ప్రముఖ గాయని ఎస్‌.జానకి వేలాది పాటలతో కోట్లాది హృదయాలను గెలుచుకున్నారని గాయనీగాయకులు కొనియాడారు. రాజమహేంద్రవరం విక్రమ్‌ హాల్లో ఆదివారం సాయంత్రం మార్కండేయ ఈవెంట్స్‌ నా గొంతు శృతిలోన 10వ విభాగం డా.సతీష్‌ సమర్పణలో సమన్వయ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ సుధాజేమ్స్‌ వాట్‌, సీఈవో డా.జేమ్స్‌వాట్‌ కొమ్ము సహకారంతో మల్లెల వేళ–అల్లరివేళ సంగీత విభావరి నిర్వహించారు. ముందుగా ఎస్‌.జానకి మృతికి సంతాపం ప్రకటించారు. ఈసందర్బంగా గాయకులు డా.సతీష్‌, రాయుడు, పిరాట్ల శ్రీహరి, భరత్‌చంద్ర, మార్కండేయ, దేవరపల్లిసునీత తదితరులు మా ట్లాడుతూ గాయని జానకికి రాజమహేంద్రవరంతో ఎంతో అనుబంధం ఉందన్నారు. సంగీత వి భావరిలో ఆమె పాటలు పాటలను అలరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement