మండలం ఓటర్లు ఈఎఫ్ డిజిటలైజేషన్ డిజిటలైజేషన్
పంపిణీ పూర్తయినవి చేయనవి
కోటనందూరు 39,947 39,947 36,317 3,630
తొండంగి 75,766 75,766 69,945 5,821
తుని రూరల్ 67,346 67,346 61,915 5,428
తుని 43,012 43,012 37,486 5,522
ప్రత్తిపాడు 66,442 66,442 61,963 4,058
రౌతులపూడి 43,839 43,839 39,367 4,424
శంఖవరం 46,656 46,656 42,322 4,093
ఏలేశ్వరం రూరల్ 37,512 37,512 33,081 3,802
ఏలేశ్వరం 25,539 25,539 21,218 2,977
గొల్లప్రోలు రూరల్ 44,882 44,882 41,310 3,569
గొల్లప్రోలు టౌన్ 20,901 20,901 8,650 1,866
పిఠాపురం రూరల్ 63,465 63,465 58,181 4,123
పిఠాపురం టౌన్ 43,425 43,425 38,666 4,590
మండలం ఓటర్లు ఈఎఫ్ డిజిటలైజేషన్ డిజిటలైజేషన్
పంపిణీ పూర్తయినవి చేయనవి
కొత్తపల్లి 68,100 68,100 61,319 5,348
కాకినాడ రూరల్ 1,53,358 1,53,358 1,24,928 28,323
కాకినాడ టౌన్ 53,056 53,056 40,761 12,285
కాకినాడ సిటీ 2,42,514 2,42,514 1,88,228 53,185
కరప 64,904 64,904 61,146 3,758
పెద్దాపురం రూరల్ 61,056 61,056 56,375 4,520
పెద్దాపురం టౌన్ 41,714 41,714 37,324 4,386
సామర్లకోట రూరల్ 71,261 71,261 61,824 9,161
సామర్లకోట టౌన్ 43,971 43,971 36,984 6,984
గండేపల్లి 46,270 46,270 41,553 4,717
గోకవరం 57,626 57,626 53,197 4,429
జగ్గంపేట 67,425 67,425 61,560 4,543
కిర్లంపూడి 60,824 60,824 54,915 5,869
మొత్తం 16,50,811 16,50,811 14,40,538 2,01,402
పిఠాపురం: సమయం మించిపోతోంది. గడువు దాటితే ఓటు హక్కు కోల్పోయినట్లేనని అధికారులు చెబుతున్నారు. ఇంకా కొంత మంది ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలు అందించడానికి జాప్యం చేస్తున్నారు. దీంతో వారు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నెల 14వ తేదీ రాత్రితో ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ గడువు ముగుస్తుంది. అది దాటితే ఇక ఫారాలు తీసుకునే అవకాశం లేదు. అయితే కొందరు గడువు పెంచుతారంటూ మిన్నకుండిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పెంచే అవకాశం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో 48 గంటల్లోపు ఇప్పటికీ ఇవ్వని ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను వెంటనే అధికారులకు అందజేసి తమ ఓటును నిలుపుకోవాల్సిన బాధ్యత ఉంది. ‘సర్’ సర్వే జిల్లాలో శరవేగంగా సాగుతోంది. ఎన్యూమరేషన్ ఫారాలు స్వీకరించడానికి కేవలం 48 గంటలు మాత్రమే సమయం ఉండడంతో అధికార యంత్రాంగం ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. ఆదివారం వరకు వచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేసే పనిని వేగంవంతం చేశారు. జిల్లాలో 16,50,811 మంది ఓటర్లు ఉండగా వంద శాతం ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఆదివారం సాయంత్రానికి 14,40,538 మంది ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. 2,01,402 ఓట్లు డిజిటలైజేషన్ పూర్తి కావాల్సి ఉంది. జిల్లాలో డిజిటలైజేషన్ కార్యక్రమం 87.26 శాతం పూర్తయ్యిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
48 గంటల్లో ఇవ్వకపోతే..
చాలామంది ఓటర్లకు బీఎల్‌ఓలు వారి ఇళ్లకు తీసుకెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందించారు. అయితే వాటిని నింపి తిరిగి ఇవ్వడంలో చాలా మంది జాప్యం చేస్తున్నారు. దీంతో జిల్లాలో ఇంకా 2.10 లక్షలకు పైగా ఎన్యూమరేషన్ ఫారాలు బీఎల్‌ఓకు అందాల్సి ఉంది. అందిన ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను ముమ్మరం చేసిన అధికారులు ఇంకా ఇవ్వని ఓటర్లు వెంటనే అందించాలని కోరుతున్నారు.
ఆ ఓట్ల పరిస్థితి ఏంటో!
జిల్లాలో మృతి చెందిన, శాశ్వతంగా వలస వెళ్లిన, నకిలీ ఓట్లు, ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వని ఓట్లు 12.20 శాతం అంటే 2,01,402 ఉన్నాయి. ఈ రెండు రోజుల్లో ఇందులో ఎంత మంది ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి వస్తారో వాటిని డిజిటలైజేషన్ చేస్తారు. లేకుంటే వాటిని తొలగిస్తామని అధికారులు వెల్లడిస్తున్నారు. దానికి అనుగుణంగా సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు.
ఫ జిల్లాలో 87.26 శాతం
డిజిటలైజేషన్ పూర్తి
ఫ మిగిలింది 48 గంటలే
ఫ డిజిటలైజేషన్ పూర్తి
కావాల్సిన ఓట్లపై తర్జనభర్జన


