గద్వాల న్యూటౌన్: జిల్లాకేంద్రంలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థిని శైనజ్ రాష్ట్రస్థాయి అండర్–14 కబడ్డీ పోటీలకు ఎంపికై ంది. ఇటీవల ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన శైనజ్‌ను ఆదివారం నుంచి మంగళవారం వరకు మహబూబాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ మేరకు శనివారం పాఠశాలలో విద్యార్థిని శైనజ్‌ను ప్రిన్సిపాల్ భవాని, వ్యాయామ ఉపాధ్యాయురాలు రాధ తదితరులు అభినందించారు.


