కబడ్డీ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

కబడ్డీ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి

Nov 22 2026 2:41 AM | Updated on Nov 22 2026 2:41 AM

● ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

● వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో భాగంగా వచ్చే నెల 17 నుంచి 22వ తేదీ వరకు జిల్లా ఇండోర్‌ స్టేడియంలో జాతీయస్థాయి కబడ్డీ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. శనివారం క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పోటీలకు మహబూబ్‌నగర్‌ ఆతిథ్యం ఇవ్వడం జిల్లాకు దక్కిన గౌరవంగా భావించాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఖేలో ఇండియా క్రీడలకు మరింత ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. ఈ పోటీలు గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు గొప్ప అవకాశమని, ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ పోటీల్లో మొత్తం 16 జట్లు పాల్గొంటాయని, వీటిలో 8 బాలికల జట్లు, మరో 8 బాలుర జట్లు ఉంటాయన్నారు. క్రీడాకారులకు వసతి, భద్రత, రవాణా, భోజన సౌకర్యాల కల్పనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ వాల్‌పోస్టర్లను ఆవిష్కరంచారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్‌ ఎం.సురేందర్‌ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, జిల్లా ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు ఎన్‌పీ వెంకటేష్‌, శిక్షణ అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాయిశివాని, డీఆర్‌ఓ నిర్మల, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీవైఎస్‌ఓ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement