అప్పులే మిగిలాయి.. | - | Sakshi
Sakshi News home page

అప్పులే మిగిలాయి..

Nov 22 2026 2:41 AM | Updated on Nov 22 2026 2:41 AM

అప్పులే మిగిలాయి.. మంచి ధరలు వస్తున్నాయి..

గట్టు శివారులో 5 ఎకరాల పొలం, ఒక బోరు ఉంది. ర్యాలంపాడు కాల్వ (ఆరగిద్ద సమీపంలో కాల్వ) నుంచి పైపులైన్‌ ద్వారా నీటిని తీసుకువచ్చాం. వానాకాలంలో 2 ఎకరాల్లో వరి, ఎకరా విస్తీర్ణంలో సీడ్‌ పత్తి, 2 ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశాను. కాల్వకు వారబంది ద్వారా వారంలో నాలుగు రోజులు మాత్రమే నీరు వదలడంతో తడులకు ఇబ్బంది ఏర్పడింది. కరెంట్‌ కోతల కారణంగా ఆ నీరు ఏమాత్రం సరిపోక ఎకరా విస్తీర్ణంలోనే వరి పంట ఎండిపోయింది. మిగిలింది తినడానికి ఇంటికే పెట్టుకున్నా. ఈసారి కరువు కారణంగా అప్పులే మిగిలాయి.

– మల్లేష్‌, రైతు, పెంచికలపాడు

వడ్లకు ఈసారి మంచి ధరలు లభిస్తున్నాయి. వానల్లేక కొంత ఇబ్బంది పడినప్పటికీ పంటను పండించుకున్న రైతులకు మాత్రం మంచి ధర లభిస్తోంది. 3 ఎకరాల్లో వరి పంటను సాగు చేసి.. క్వింటాల్‌ రూ.3,800లకు పొలం దగ్గరే అమ్మేశా. మంచి ధర లభించింది. కరెంట్‌ సక్రమంగా లేక కొంత మేరకు ఇబ్బంది పడాల్సి వచ్చింది.

– ప్రతాప్‌రెడ్డి, రైతు, గట్టు

●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement