న్యాయ సేవా కేంద్రంను వినియోగించుకోండి | - | Sakshi
Sakshi News home page

న్యాయ సేవా కేంద్రంను వినియోగించుకోండి

Nov 22 2026 2:41 AM | Updated on Nov 22 2026 2:41 AM

గట్టు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మాచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామీణ న్యాయ సేవా కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని గద్వాల ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి నాగరాజు అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నల్సా పథకాల అమలులో భాగంగా శనివారం మాచర్లలో గ్రామీణ న్యాయ సేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరికి న్యాయ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించాలనే లక్ష్యంతోనే మాచర్లలో గ్రామీణ న్యాయ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉచితంగా న్యాయ సలహాలు, సహాయం, భూ తగాదాలు, కుటుంబ సమస్యలు, ఆస్తి వివాదాలు, ఆర్థిక సమస్యలపై న్యాయ సలహాలు పొందవచ్చన్నారు. లోక్‌ అదాలత్‌ ద్వారా చిన్న చిన్న సమస్యలు, వివాదాలను పరస్పర అంగీకారంతో తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవచ్చని చెప్పారు. వృద్ధులు, దివ్యాంగులు, బలహీన వర్గాల వారి హక్కులు, చట్టపరమైన రక్షణపై సలహాలు తీసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సర్పంచు వజ్రమ్మ, ఉప సర్పంచు సుదర్శన్‌, ఎస్‌ఐ కల్యాణ్‌కుమార్‌, న్యాయవాది యుగేందర్‌, పారా లీగల్‌ వలంటీర్లు గిరిబాబు, దైవప్రసాద్‌, నరేంద్రకుమార్‌, రాంభూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement