హక్కులపై అవగాహన తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

హక్కులపై అవగాహన తప్పనిసరి

Nov 12 2026 12:49 AM | Updated on Nov 12 2026 12:49 AM

మల్దకల్‌: ప్రతి విద్యార్థి తమ హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండి, సురక్షిత వాతావరణంలో చదువుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జూనియర్‌ సివిల్‌జడ్జి నిష్కాపాత్రుడు సూచించారు. జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మల్దకల్‌ రైతువేదికలో జెడ్పీహెచ్‌ఎస్‌, కేజీబీవీ విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయన్నారు. అలాంటి ఘటనలు ఎదురైతే ధైర్యంగా తల్లిదండ్రులు లేదా అధికారులకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. క్షేత్రస్థాయిలో బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు అందరూ కృషి చేయాలని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ న్యాయం అందుబా టులో ఉండాలనే ఉద్దేశంతోనే జాతీయ న్యాయ సేవాధికార సంస్థ పనిచేస్తోందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారు, దివ్యాంగులు, మహిళలు, పిల్ల లు, షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన వారు ఉచితంగా న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. న్యాయ సేవలకు సంబంధించిన సమాచారం పొందడానికి హెల్ప్‌లైన్‌ 15100 నంబర్‌ అందుబాటులో ఉంటుందన్నారు. అనంతరం పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చిట్టెమ్మ, ఎంఈఓ సురేశ్‌, హెచ్‌ఎం రాజేశ్వర్‌రెడ్డి, కేజీబీవీ ఎస్‌ఓ విజయలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement