శాస్త్రోక్తంగా ముగిసిన వెంకన్న బ్రహ్మోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

శాస్త్రోక్తంగా ముగిసిన వెంకన్న బ్రహ్మోత్సవాలు

Nov 12 2026 12:49 AM | Updated on Nov 12 2026 12:49 AM

కేటీదొడ్డి: మండలంలోని వెంకటాపురంలో శ్రీపాగుంట లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం శాస్త్రోక్తంగా ముగిశాయి. చివరిరోజు ఉద్వాస ప్రదక్షిణం, చక్రస్నాన ఘట్టం భక్తుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ అనంతరం నిత్యహోమం, శ్రీహయగ్రీవ ఇష్టి, లఘు పూర్ణాహుతి కార్యక్రమాలు ఆగమశాస్త్రం ప్రకారం కొనసాగాయి. అనంతరం ఆలయ సమీపంలోని పుష్కరిణిలో వేద మంత్రోచ్చారణల నడుమ ఉత్సవ మూర్తులకు చక్రస్నానం, దేవతోద్వాసన, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు. కాగా, లక్ష్మీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణంతో పాటు జాతర మైదానం కిక్కిరిసింది. జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement