డిజిటల్‌ విధానంలో పారదర్శకంగా సేవలు | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ విధానంలో పారదర్శకంగా సేవలు

Nov 6 2026 12:44 AM | Updated on Nov 6 2026 12:44 AM

గద్వాల న్యూటౌన్‌: ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగుల సర్వీసు వ్యవహరాలన్నీ డిజిటల్‌ విధానంలో పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ట్రెజరీ అధికారి గాయత్రి అన్నారు. ఈ–సాంక్షన్‌, ఈ–హెచ్‌ఆర్‌ఎంస్‌, వర్క్స్‌ అకౌంట్స్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం విధానాల అమలుపై జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల డ్రాయింగ్‌ అండ్‌ డిస్బర్సింగ్‌, జిల్లా అధికారులకు గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన శిక్షణలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఐఎఫ్‌ఎంఐఎస్‌ ద్వారా ప్రభుత్వ శాఖల ఆర్థిక లావాదేవీలు, బిల్లుల చెల్లింపులు, ఉద్యోగుల సేవా వ్యవహారాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడమే లక్ష్యమన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన డిజిటల్‌ విధానాలను అధికారులు పూర్థిస్థాయిలో అర్థం చేసుకొని, నిబంధనల మేరకు సమర్థవంతంగా వినయోగించుకోవాలన్నారు. ఈ–సాంక్షన్‌ విధానం ద్వారా ప్రభుత్వ నిధుల మంజూరు, పరిపాలన అనుమతులు, సంబంధిత ఆర్థిక ఆమోద ప్రక్రియలను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు వీలుంటుందని చెప్పారు. ఈ–హెచ్‌ఎస్‌ఐఆర్‌ఎంఎస్‌ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు వివరాలు, రిజిస్టర్లు, ఉద్యోగుల సేవా రికార్డులను డిజిటల్‌ విధానంలో నిర్వహించవచ్చని పేర్కొన్నారు. తద్వారా ఉద్యోగుల వివరాలను సులభంగా పరిశీలించడంతోపాటు, సేవా సంబంధిత వ్యవహారాలను మరింత వేగంగా, పారదర్శకంగా చేపట్టవచ్చన్నారు. డిజిటల్‌ విధానం అమలులో ఎదురయ్యే సందేహాలను శిక్షణలో నివృత్తి చేసుకొని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement