ఎన్నికల కమిషన్‌పై నిరాధార ఆరోపణలు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల కమిషన్‌పై నిరాధార ఆరోపణలు

Nov 1 2026 4:43 AM | Updated on Nov 1 2026 4:43 AM

గద్వాల న్యూటౌన్‌: కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ పార్టీ నిరాధార ఆరోపణలు చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. శనివారం స్థానిక డీకే బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సర్‌ ప్రక్రియపై కాంగ్రెస్‌ నాయకులు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణ అనేది ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చట్టబద్ధంగా, పారదర్శకంగా కొనసాగుతుందన్నారు. ఓటర్ల జాబితాలో తప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవడానికి, అర్హులైన కొత్త ఓటర్ల పేర్లు నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తుందన్నారు. ఓటర్ల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆధారాలతో ఎన్నికల అధికారులను సంప్రదించి, చట్టబద్ధమైన విధానంలో సమస్యలను పరిష్కరించుకోవాలని హితవు పలికారు. సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు వెంకట్రాములు, రాష్ట్ర మహిళా మోర్చా అధికార ప్రతినిధి రమాదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యాంరావు, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement