మల్దకల్: మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతిఒక్కరూ భక్తిమార్గంలో నడుచుకోవాలని మంత్రాలయ పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు అన్నారు. శనివారం ఆదిశిలా క్షేత్రంలోని స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో సంస్థాన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ యువత చెడుమార్గం వీడి సన్మార్గంలో నడుచుకోవాలన్నారు. ఇంట్లో ఉన్న దేవుడు ఇంటిల్లిపాదిని కాపాడితే.. గుడిలో ఉన్న దేవుడు సమస్త ప్రజలను కాపాడుతాడని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా.. శనివారం ఆయన భక్తులతో కిక్కిరిసింది. ముందుగా అర్చకులు రమేషాచారి, రవిచారి స్వామివారికి అభిషేకాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, అర్చకులు మధుసూదనాచారి, నర్సింహులు, చంద్రశేఖర్‌రావు, రాముడు, దీరేంద్రదాసు తదితరులు పాల్గొన్నారు.


