గద్వాల: పింఛన్ లబ్ధిదారుడైన భర్త మరణించినప్పుడు ఆయన భార్యకు తక్షణ పింఛన్ అందించే సదుపాయాన్ని అర్హులైన మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషాషేక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పింఛన్ పొందుతున్న భర్తలు మరణించిన సందర్భాల్లో వారి భార్యాలకు తక్షణమే సామాజిక భద్రతా పెన్షన్ మంజూరు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వృద్ధాప్య పింఛన్‌తోపాటు దివ్యాంగులు, గీతా, చేనేత కార్మికులు, డయాలసిస్, హెచ్‌ఐవీ, ఫైలేరియా పింఛన్ లబ్ధిదారుల భార్యలకు సైతం తక్షణ పింఛన్ సదుపాయం వర్తిస్తుందన్నారు. అర్హులైన వారు గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శికి, మున్సిపాలిటీలో బిల్‌కలెక్టర్‌కు దరఖాస్తుతోపాటు ఆధార్ కార్డు, బ్యాంకు పాసుబుక్కు జిరాక్స్, మరణించిన పింఛన్ లబ్ధిదారుడి ఆధార్, మరణ ధ్రువీకరణ పత్రాలు జిరాక్స్ సమర్పించాలని చెప్పారు.


