క్రీడలలో జిల్లా ఖ్యాతిని చాటాలి | - | Sakshi
Sakshi News home page

క్రీడలలో జిల్లా ఖ్యాతిని చాటాలి

Nov 1 2026 4:43 AM | Updated on Nov 1 2026 4:43 AM

అలంపూర్‌: క్రీడలలో జిల్లా ఖ్యాతిని చాటాలని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. అలంపూర్‌ చౌరస్తాలోని ప్రయాగ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ పాఠశాల ఆవరణలో ఎస్‌జీఎఫ్‌ 70వ జిల్లాస్థాయి బాలికల క్రీడా పోటీలు శనివారం జరిగాయి. పోటీలను ఎమ్మెల్యే విజయుడు డీఈఓ విజయలక్ష్మి, ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులుతో కలిసి అండర్‌–14, 17 బాలికల విభాగం ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌ క్రీడలను ప్రారంభించారు. ఇందులో 13 మండలాల నుంచి 936 మంది క్రీడాకారిణులు పాల్గొనగా.. తొలిరోజు పోటీలు హోరాహోరిగా సాగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలికలు క్రీడలపై ఆసక్తితో ముందుకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. క్రీడాకారులను ప్రొత్సహించి అండగా ఉంటామన్నారు. క్రీడలకు, క్రీడాకారులకు తమవంతుగా సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. డీఈఓ విజయలక్ష్మి మాట్లాడుతూ బాలికలు క్రీడలతోపాటు విద్యలోనూ రాణించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు అశోక్‌కుమార్‌, రామకృష్ణ, శివప్రసాద్‌, జీహెచ్‌ఎం జాఫరుల్లా ఖాన్‌, టోర్నీ కన్వీనర్‌ భరత్‌కుమార్‌, ప్రయాగ్‌ స్కూల్‌ హెడ్‌ మాధవి, ప్రిన్సిపల్‌ సుష్మా, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.

విజేతలు వీరే..

అండర్‌–14 ఖోఖో విభాగంలో విజేతగా వడ్డేపల్లి మండలం, రన్నర్‌గా మానవపాడు మండలం, కబడ్డీలో విజేతగా గద్వాల, రన్నర్‌గా ఎర్రవల్లి, వాలీబాల్‌ విభాగంలో విజేతగా మల్దకల్‌, రన్నర్‌గా గట్టు మండలాలు నిలిచాయి. అండర్‌–17 విభాగంలో విజేతగా మల్దకల్‌, రన్నర్‌గా గద్వాల, కబడ్డీ విభాగంలో విజేతగా మల్దకల్‌, రన్నర్‌గా ఉండవెల్లి, వాలీబాల్‌ విభాగంలో విజేతగా మల్దకల్‌, రన్నర్‌గా మానవపాడు మండలాలు గెలుపొందాయి.

ఎమ్మెల్యే విజయుడు పిలుపు

అట్టహాసంగా ఎస్‌జీఎఫ్‌ 70వ జిల్లాస్థాయి క్రీడా పోటీలు

13 మండలాల నుంచి

936 మంది క్రీడాకారుల హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement