బ్యాంకు సేవలు వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

బ్యాంకు సేవలు వినియోగించుకోవాలి

Oct 31 2026 6:08 AM | Updated on Oct 31 2026 6:08 AM

గద్వాలన్యూటౌన్‌: బ్యాంకులు అందించే సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని మెప్మా ఏడీఎంసీ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ డీపీఎం సలోమి సూచించారు. శుక్రవారం జిల్లా మహిళా సమాఖ్య భవనంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఎస్‌ఐఆర్‌డీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. సామాజిక భద్రతలో భాగంగా పలు రకాల బీమా పథకాలను తక్కువ ప్రీమియంతో బ్యాంకులు అందిస్తున్నాయని చెప్పారు. బ్యాంకుల్లో నగదు నిల్వ ఉంచితే ప్రయోజనం కలుగుతుందన్నారు. నిబంధనలకు అనుగుణంగా అన్ని ధ్రువపత్రాలు సమర్పిస్తే, వివిధ వ్యాపారాల కోసం రుణాలు అందిస్తాయని తెలిపారు. అనంతరం ట్రెయినీ శశికళారెడ్డి, సురేశ్‌రెడ్డి కళాజాత బృందం ఆర్థిక అక్షరాస్యతపై శిక్షణ అందించారు. కార్యక్రమంలో ఎస్‌ఐఆర్‌డీ సంస్థ కార్యదర్శి కుర్మయ్య, అరుణ, వెంకటేశ్‌, కమ్యూనిటీ ఆర్గనైజర్లు నిజాముద్దీన్‌, మహాలక్ష్మి, డీఈఓ తిమ్మన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement