ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Oct 31 2026 6:08 AM | Updated on Oct 31 2026 6:08 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రీజినల్‌ కార్యదర్శి వెంకటయ్య కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆర్‌ఎం సంతోష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రీజియన్‌ పరిధిలో పెండింగ్‌లో ఉన్న సిబ్బంది బదిలీల దరఖాస్తులను పరిశీలించాలన్నారు. ప్రతి డిపోలో ఆర్‌ఓ ప్లాంట్‌ ఏర్పాటుతోపాటు శాసీ్త్రయంగా రోడ్డు సర్వే నిర్వహించి పనిగంటలు మార్పు చేయాలన్నారు. కార్మికులకు వారంలో తప్పనిసరిగా ఒక స్పెషల్‌ ఆఫ్‌ డ్యూటీ కల్పించాలని, హైదరాబాద్‌ రూట్‌లోని స్టేజీల మార్పు ఆలోచనను విరమించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ప్రభాకర్‌, కృష్ణయ్య, వెంకటయ్య, శ్రీనివాసులు, నారాయణ, అంబయ్య, అశోక్‌గౌడ్‌, వెంకటేశ్వర్లు, బాల్‌నారాయణ, తిరుపతి, ఎండీ ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement