జాతీయ కబడ్డీ జట్టుకు జిల్లా క్రీడాకారుడు | - | Sakshi
Sakshi News home page

జాతీయ కబడ్డీ జట్టుకు జిల్లా క్రీడాకారుడు

Oct 31 2026 6:08 AM | Updated on Oct 31 2026 6:08 AM

గద్వాలన్యూటౌన్‌: జాతీయ కబడ్డీ జట్టుకు జిల్లా క్రీడాకారుడు అజిత్‌కుమార్‌ ఎంపికయ్యారు. అక్టోబర్‌ 2 నుంచి 5 వరకు వేములవాడలో జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీలో అజిత్‌కుమార్‌ పాల్గొని అత్యుత్తమ ప్రతిభకనబర్చడంతో నవంబర్‌ 1 నుంచి 4వ తేదీ వరకు బీహార్‌ రాష్ట్రంలోని పాట్నాలో జరిగే జాతీయస్థాయి కబడీ పోటీలకు ఎంపిక చేశారు. అజిత్‌కుమార్‌ ఎంపికపై జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షురాలు డీకే స్నిగ్దారెడ్డి, జనరల్‌ సెక్రటరీ నర్సింహ, ట్రెజరర్‌ చందు, జాయింట్‌ సెక్రటరీ రవి, పీడీలు స్రవంతి, హేమావతి, నగేష్‌, కోచ్‌ ఉషన్‌, మేనేజర్‌ బుచ్చిబాబు, నాయకులు మీర్జాపురం వెంకటేశ్వర్‌రెడ్డి, బండల వెంకట్రాములు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement