పట్టభద్రుల ఓటరు నమోదుకు ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

పట్టభద్రుల ఓటరు నమోదుకు ప్రోత్సహించాలి

Oct 27 2026 12:03 AM | Updated on Oct 27 2026 12:03 AM

ఎర్రవల్లి/ ఉండవెల్లి/ అలంపూర్‌ రూరల్‌: జిల్లాలో ని పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా కాంగ్రెస్‌ నాయకులు ప్రోత్సహించాలని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ అన్నా రు. సోమవారం ఎర్రవల్లి, ఉండవెల్లి, అలంపూర్‌ పట్టణంలో నిర్వహించిన ఓటరు నమోదు హెల్ప్‌ డెస్క్‌ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్‌– రంగారెడ్డి– హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్‌రెడ్డికి మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలన్నారు. పట్టభద్రులు పెద్దసంఖ్యలో ఓటర్లుగా నమోదు కావడం ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎంతో కీలకం అని చెప్పారు. 2023 నా టికి డిగ్రీ పూర్తి చేసిన అందరూ వచ్చేనెల 6వ తేదీలోగా ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, అందరూ అప్రమత్తంగా ఉండాలని, గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. అనంతరం కోదండాపురంలో వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement