ఓటు కోసం ప్రతి కార్యకర్త పోరాడాలి | - | Sakshi
Sakshi News home page

ఓటు కోసం ప్రతి కార్యకర్త పోరాడాలి

Oct 26 2026 2:34 AM | Updated on Oct 26 2026 2:34 AM

గద్వాల: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం సామన్య ప్రజల ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందని ఏఐసీసీ కార్యదర్శి రవీంద్రదాస్‌, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం నిర్వహించిన ఓటు బచావో విస్తృత స్థాయి సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఓటుహక్కు పరిరక్షణ కోసం ప్రతి కార్యకర్త పోరాడాలని చెప్పారు. ఇందులో భాగంగా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు నవంబర్‌ 1న ఢిల్లీలో నిర్వహించనున్న మహాధర్నాకు రాష్ట్రం నుంచి 15 వేల మంది కాంగ్రెస్‌ శ్రేణులు తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. త్వరలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్‌స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement