ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరందించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరందించాలి

Oct 25 2026 12:41 AM | Updated on Oct 25 2026 12:41 AM

ధరూరు: జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరందించడంతోపాటు తాగునీటి నాణ్యత పరీక్షలను నిరంతరం పరీక్షించాలని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషాషేక్‌ అన్నారు. శనివారం ఆయన మండలంలోని జూరాల డ్యాం వద్ద ఉన్న మిషన్‌ భగీరథ హెడ్‌ వర్క్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా జూరాల ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు, జూరాల నుంచి ఎంత మేర నీరు దిగువకు, తాగునీటి అవసరాలకు వినియోగించుకుంటున్నారనే దానిపై ఇరిగేషన్‌ అధికారులతో చర్చించారు. అంతకు ముందు జూరాల ప్రాజెక్టుపై వరద నియంత్రణ పరికరాలను పరిశీలించి.. ఫ్లడ్‌ కంట్రోల్‌ రూంలో అధికారులతో సమీక్షించారు. అనంతరం మిషన్‌ భగీరథ హెడ్‌ వర్క్స్‌ను సందర్శించి.. సిబ్బంది హాజరు, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాజెక్టులో నీటినిల్వ తక్కువగా ఉన్నందున వినియోగంపై అధికారులతో చర్చించారు. అలాగే అక్రమ నీటి కనెక్షన్లను అరికట్టాలని సూచించారు. నిబంధనల ప్రకారం నీటిని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మిషన్‌ భగీరథ ఈఈ శ్రీధర్‌రెడ్డి, ఇరిగేషన్‌ ఈఈ సంజీవప్రసాద్‌, తహసీల్దార్‌ నందిని, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్‌ అన్నారు. రేవులపల్లి ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన విద్యార్థులతో మాట్లాడారు. చదువులో ఏ విద్యార్థి ఏ సబ్జెక్టులో వెనకబడి ఉన్నారో తెలుసుకుని ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. పరీక్షలకు ఇంకా 5 నెలల సమయం ఉందని, ఇప్పటి నుంచే సాధన చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు సందేహాలను ఉపాధ్యాయులతో నివృత్తి చేసుకుని ముందుకు సాగాలన్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల చదువుపై దృష్టిపెట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ రవీంద్రబాబు, ఇన్‌చార్జి హెచ్‌ఎం తిరుమల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సిబ్బంది హాజరు, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

అక్రమ నీటి కనెక్షన్లను అరికట్టేందుకు చర్యలు

మిషన్‌ భగీరథ హెడ్‌ వర్క్స్‌ను పరిశీలించిన కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement