మహిళల కబడ్డీ జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

మహిళల కబడ్డీ జట్టు ఎంపిక

Oct 25 2026 12:41 AM | Updated on Oct 25 2026 12:41 AM

గద్వాల న్యూటౌన్‌: జిల్లాకేంద్రంలోని ఇండోర్‌ స్టేడియంలో శనివారం జిల్లా సీనియర్‌ మహిళా కబడ్డీ జట్టును ఎంపిక చేశారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపికలకు ముఖ్య అతిథిగా ఎస్‌జీఎఫ్‌ శ్రీనివాసులు హాజరయ్యారు. ఎంపికలకు 60 మంది క్రీడాకారులు పాల్గొనగా.. ఇందులో ప్రతిభకనబర్చిన 14 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. ఎంపికై న జట్టు అక్టోబర్‌ 28 నుంచి 30 వరకు ఖమ్మం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీలో పాల్గొంటుందని అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి నర్సింహ తెలిపారు. కార్యక్రమంలో కోశాధికారి చందు, సహ కార్యదర్శి రవి, ఈసీ సభ్యులు వెంకటన్న, పాషా, హైమావతి, పీడీ బీసన్న, హుస్సేన్‌, బుజ్జిబాబు, క్రీడాకారులు పాల్గొన్నారు.

పల్లీ @ రూ.7,489

గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు శనివారం 183 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. కాగా.. క్వింటాల్‌ గరిష్టంగా రూ.7,489, కనిష్టంగా రూ.5,089, సరాసరిగా రూ.6,440 ధరలు లభించాయి. అలాగే 18 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. క్వింటాల్‌ గరిష్టంగా రూ.8,029, కనిష్టంగా రూ.7,889, సరాసరిగా రూ.7,929 చొప్పున పలికాయి.

పత్తి క్వింటా రూ.9,210

జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో శనివారం పత్తికి క్వింటా గరిష్టంగా రూ.9,210, కనిష్టంగా రూ.8,630 ధరలు లభించాయి. అదేవిధంగా మొక్కజొన్న క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,936, కనిష్టంగా రూ.2,316, వేరుశనగకు రూ.5,656, ఆముదాలు రూ.7,710, మినుములు రూ.9,000 ధరలు లభించాయి.

45 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఈసీ ఆమోదం

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న 45 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (ఈసీ) ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లో నిర్వహించిన పీయూ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి తదుపరి రోస్టర్‌, రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టనున్నారు. వీటితోపాటు యూనివర్సిటీలో విద్యుత్‌ సంబంధిత పనుల కోసం సుమారు రూ.13 లక్షల నిధుల కేటాయింపునకు ఈసీ ఆమోదం తెలిపింది. ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలకూ అనుమతులు మంజూరు చేసింది. యూనివర్సిటీలో పనిచేస్తున్న టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ సిబ్బందికి ప్రభుత్వం ప్రకటించిన రెండు డీఏలకు కూడా ఈసీ ఆమోదం తెలిపింది. సమావేశంలో అధికారులు యోగితారాణా, సిక్తా పట్నాయక్‌, పీయూ వీసీ శ్రీనివాస్‌, రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement