గట్టు, కేటీదొడ్డి మండలాల్లోని 33 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా గట్టు ఎత్తిపోతల పథకం మంజూరైంది. అయితే 1.32 టీఎంసీలతో 33 వేల ఎకరాలకు సాగునీరు అందించడం కష్టసాధ్యమని గత ప్రభుత్వం పెద్దలకు చెప్పాను. ప్రస్తుత ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాను. ప్రస్తుత ప్రభుత్వ క్యాబినేట్ 3 టీఎంసీలకు పెంచుతూ ఆమోదం తెలపడమే కాకుండా జీఓ కూడా విడుదల చేసింది. పనులు వేగవంతంగా పూర్తి చేసి 33 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించేలా కృషిచేస్తాను.
– బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల
ఆమోదం తెలిపింది..
గట్టు ఎత్తిపోతల పథకాన్ని 1.32 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి జీఓ విడుదల చేసింది. ఇప్పటికే సివిల్ వర్క్స్, భూ సేకరణ పనులు 30 శాతం మేర పూర్తయ్యాయి. పెంచిన సామర్థ్యానికి అనుగుణంగా పనులు చేపట్టి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.
– రహీముద్దీన్, సీఈ, ఇరిగేషన్ శాఖ
●


