అసలేం జరుగుతోంది..? | - | Sakshi
Sakshi News home page

అసలేం జరుగుతోంది..?

Oct 24 2026 5:47 AM | Updated on Oct 24 2026 5:47 AM

గద్వాల క్రైం: నడిగడ్డ సాగు, తాగునీటి వనరులకు ఆయువు పట్టుగా ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్‌, జవహార్‌ నెట్టెంపాడు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాలు, రాజోళి బండ డైవర్షన్‌ స్కీం వంటి ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం.. కాల్వల మరమ్మతు, టెండర్లు కోట్‌ చేసిన విలువైన ఫైళ్లు, రికార్డులు దగ్ధమైన సంఘటన జిల్లా ఇరిగేషన్‌ శాఖలో చోటుచేసుకుంది. మరోవైపు రూ.లక్ష విలువైన ప్రొజెక్టు సైతం మాయమైంది. ఈ విషయాలన్నీ ఎక్కడా బహిర్గతం కాకుండా సంబంధిత అధికారులు గోప్యంగా ఉంచడం జోగుళాంబ జిల్లాలో కలకలం రేపింది. ఈ క్రమంలో ఇరిగేషన్‌ కార్యాలయంలో అసలు ఏం జరుగుతుందోనన్న ఆందోళన, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విచారణ చేపట్టాం..

ఇరిగేషన్‌ శాఖ కార్యాయలంలో జరిగిన సంఘటనపై ఆ శాఖ అధికారులు గురువారం ఫిర్యాదు చేశారు. రికార్డులు కాలిపోయిన వ్యవహారం మా దృష్టికి రాలేదు. ప్రొజెక్టర్‌ అపహరణపైనే విచారణ చేపడ్తున్నాం. క్లూస్‌ టీం బృందం అనుమానితుల ఫింగర్‌ ప్రింట్స్‌ సేకరించారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం.

– శ్రీనివాసులు, పట్టణ ఎస్‌ఐ, గద్వాల

జిల్లా ఇరిగేషన్‌ కార్యాలయంలో రికార్డులు దగ్ధం

రూ.లక్ష విలువ గల ప్రొజెక్టర్‌ మాయం

గోప్యంగా ఉంచడంపై రేకెత్తుతున్న అనుమానాలు

పోలీసులకు ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన వైనం

అవినీతిని కప్పిపుచ్చేందుకు ఫైళ్ల దగ్ధం నాటకం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement