విద్యార్థుల హాజరు శాతం పెరగాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల హాజరు శాతం పెరగాలి

Oct 24 2026 5:47 AM | Updated on Oct 24 2026 5:47 AM

గద్వాల: విద్యార్థులు చదువులో రాణించేందుకు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషాషేక్‌ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు రాని విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే విద్యార్థులు వెనకబడిన సబ్జెక్టులలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలు దాతల సహకారంతో నిర్మించిన స్టేజీ షెడ్‌, మరుగుదొడ్ల నిర్మాణాన్ని పరిశీలించారు.

పకడ్బందీగా రీసర్వే..

జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను కచ్చితత్వంతో పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అన్నారు. మండలంలోని సంగాల గ్రామ పంచాయతీలో జరుగుతున్న రీసర్వే పనులను పరిశీలించారు. సరిహద్దుల నిర్ధారణకు అందుబాటులో ఉన్న పాతరికార్డులతోపాటు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు, రహదారులు, గ్రామకంఠం, చెరువులు, కుంటలు, గట్టు తదితరాలను ప్రత్యేకంగా గుర్తించి రికార్డులలో నమోదు చేయాలన్నారు. గ్రామంలో ప్రైవేటు భుముల సర్వే చేపట్టే తేదీని ముందుగానే రైతులకు తెలియజేయాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో సర్వే ఏడీ నూకరాజు, తహసీల్దార్‌ హరికృష్ణ, డీటీ అజిత్‌, ఆర్‌ఐ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement