ఇప్పటికే మూడు సార్లు పత్తి విత్తనం వేశాను. మొదటి రెండుసార్లు అసలు మొలకలు కూడా రాకపోవడంతో మూడోసారి వేశాను. అయినా కూడా ఆశలు కనిపించడం లేదు. ఆర్డీఎస్ నుంచి వచ్చిన నీరు పూర్తిస్థాయిలో అందలేదు. పంట ఎండుతుంటే చూడలేకపోతున్నాం. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. శనివారం వర్షం కొన్నిచోట్ల మాత్రమే కురిసింది.
– సునీల్‌కుమార్, శాంతినగర్, వడ్డేపల్లి మండలం
ఇప్పట్లో లిఫ్టు నడవదు..
20 రోజులపాటు తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా నీరు అందించాం. దీంతో ఆయకట్టుకు కొంత ఊరట లభించింది. ప్రస్తుతం నదిలో నీరు లేదు. ఎగువ ప్రాజెక్టుల నుంచి వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు. ఫలితంగా ఇప్పట్లో తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా నీరు అందించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఎగువన వర్షాలు కురిస్తే అవకాశాలు ఉంటాయి. – రామదాసు, ఆర్డీఎస్ ఏఈ


