కళాశాల సమస్యలపై హైకోర్టు జడ్జికి పోస్టుకార్డు లేఖలు | - | Sakshi
Sakshi News home page

కళాశాల సమస్యలపై హైకోర్టు జడ్జికి పోస్టుకార్డు లేఖలు

Jul 21 2026 1:14 AM | Updated on Jul 21 2026 1:14 AM

గట్టు: గట్టులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నెలకొన్న సమస్యలపై సోమవారం విద్యార్థులు హైకోర్టు జడ్జికి పోస్టు కార్డు ద్వారా లేఖలు రాశారు. పాలమూరు ఎన్‌ఆర్‌ఐ, ఎంవీఎఫ్‌ల ఆధ్వర్యంలో గట్టు కళాశాల విద్యార్థులు హైకోర్టు జడ్జికి లేఖలను రాశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఎంపీసీ కోర్సులలో లెక్చరర్లు లేరని, చుట్టుపక్కల గ్రామాల నుంచి కళాశాలకు రావడానికి రవాణా సౌకర్యాలు లేవని, కళాశాల చుట్టూ ప్రహరీ లేని కారణంగా తాము ఇబ్బంది పడుతున్నట్లు విద్యార్థులు జడ్జికి రాసిన పోస్టు కార్డు లేఖలో పేర్కొన్నారు. కార్యక్రమంలో పాలమూరు ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్‌ మైపాల్‌రెడ్డి, ఎంవీఎఫ్‌ మండల ఇన్‌చార్జి కిరణ్‌కుమార్‌, మొబిలైజర్‌ వీణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement