ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి
గద్వాలవ్యవసాయం: పీఎం కిసాన్ సమ్మాన్‌నిధి లబ్ధిదారులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియానాయక్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రం సమీపంలోని నది అగ్రహారంలో ఏర్పాటుచేసిన ఫార్మర్ రిజిస్ట్రీ అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. పట్టా భూమి కలిగిన రైతులు తమ ఆధార్‌కు లింక్ ఉన్న ఫోన్ నంబర్‌తో ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తిచేసుకోవాలని చెప్పారు. ప్రతి రైతుకు 11 నంబర్లు గల రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుందని.. జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలో అర్హులైన రైతులందరూ ఈ నెల 15వ తేదీలోగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని తెలిపారు. అదే విధంగా పీఎం కిసాన్ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీతో కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించచారు. కార్యక్రమంలో ఏఈఓ హరీశ్ పాల్గొన్నారు.


