నగరంలో మా ఏజెన్సీ పరిధిలో నెలకు 3 వేల వరకు కమర్షియల్ సిలిండర్లు అందిస్తున్నాం. వాటన్నింటినీ పూర్తిగా నిలిపివేశాం. ఇళ్లకు ఇచ్చే వాటిలో ఎలాంటి సమస్య లేదు.. వాటిని సక్రమంగా అందిస్తున్నాం. రెండు, మూడు కనెక్షన్స్ ఉన్న వాళ్లు మొత్తం అడ్వాన్స్ బుక్ చేసుకోవడానికి చూస్తున్నారు. దీంతో సర్వర్ సమస్య వస్తోంది. హోటల్స్, పరిశ్రమలు ఇతర కమర్షియల్ వాటికి ఇవ్వడం లేదు. తర్వాత ఎలా ఉంటుందనే అంశంపై నేడు సమావేశం ఉంటుంది. – లక్ష్మీకాంత్‌రెడ్డి,
స్వప్న గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు
హోటల్ నిర్వహణ కష్టంగా ఉంది
మా రెస్టారెంట్‌లో రోజుకు నాలుగు సిలిండర్లు అవస రం అవుతాయి. ప్రస్తుతం ఒకటి ఇచ్చారు. దీంతో హోటల్ నడపటం చాలా కష్టం. మా దగ్గర 150 రకాల వంటకాలు ఉంటా యి. కానీ సిలిండర్ల కొరత వల్ల బిర్యానీతో పాటు ఒకటి రెండు రకాల వంటలు చేయాల్సిన పరిస్థితి. రోజు కట్టెల పొయ్యి మీద వంటలు చేయడం కష్టం. ఇలాగే కొనసాగితే హోటళ్ల నిర్వహణ పూర్తిగా కష్టంగా మారుతుంది. – నిరంజన్‌రెడ్డి, శిల్పి హోటల్ యాజమాని, మహబూబ్‌నగర్
సిలిండర్లు లేవని చెబుతున్నారు
సాధారణంగా కట్టెల పొయ్యిపై అన్ని రకాల టిఫిన్స్ చేయడం సాధ్యం కాదు. టిఫిన్ హోటల్స్‌కు తప్పక సిలిండర్లు అవసరమవుతాయి. అవంతి హోటల్‌లో నిత్యం 5 సిలిండర్ల వినియోగం ఉంటుంది. ప్రస్తుతం కొరత వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. గ్యాస్ ఏజెన్సీల దగ్గర సిలిండర్లు లేవని చెబుతున్నారు. – చంద్రశేఖర్ శెట్టి, అవంతి హోటల్
●


