జిల్లాలో ప్రైవేట్ వసతి గృహాలకు పూర్తిగా సిలిండర్ల పంపిణీ పూర్తిగా నిలిపివేశారు. ప్రైవేట్ రెసిడెన్షియల్ కళాశాలల్లోనూ నిత్యం మూడు సిలిండర్లు వాడుతారు. సరఫరా నిలిచిపోవడంతో ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వ వసతి గృహాలకు అందిస్తున్నామని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో రావడం లేదు. దీంతో కొన్ని హాస్టళ్లలో కట్టెల పొయ్యిలపై వంటలు పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వ వసతి గృహాలకు సరఫరా చేయాలని ఆదేశాలు వస్తుండటంతో కోత విధిస్తూ అరకొరగా సరఫరా చేస్తూ పొదుపుగా వాడుకోమని చెబుతున్నారు. అయితే మరో రెండు, మూడు రోజుల్లో ఈ సమస్య మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని ఓ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు తెలిపారు. కాగా.. గృహ వినియోగ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. కొరత లేదని చెబుతున్నా బుకింగ్‌లో సర్వర్ పని చేయకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. సరఫరాలోనూ ఆలస్యం జరుగుతోంది. కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారుల నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది.


