కొత్తపల్లి: మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో వెలిసిన గిరిజన ఆరాధ్య దైవం గురులోకామసంద్ బావోజి జాతర గోడపత్రికను గురువారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఏప్రిల్ 1 నుంచి జరిగే ఉత్సవాలకు రావాలని సీఎంకు ఆలయ కమిటీ ఆహ్వాన పత్రిక అందజేసింది. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గోపాల్‌నాయక్, పాలమూరు విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్స్‌లర్ లక్ష్మీకాంత్‌రాథోడ్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు నర్సింహులు, నిడ్జింత తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచ్ రమేశ్‌రెడ్డి, సుభాష్ నాయక్, రవి నాయక్, రాజేష్ రాథోడ్, అనిల్‌నాయక్, లాల్యానాయక్, నర్సింహారెడ్డి, రాఘవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


