జోగుళాంబ క్షేత్రం మహిమాన్విత శక్తిపీఠం | - | Sakshi
Sakshi News home page

జోగుళాంబ క్షేత్రం మహిమాన్విత శక్తిపీఠం

Mar 8 2026 7:36 AM | Updated on Mar 8 2026 7:36 AM

అలంపూర్‌: జోగుళాంబ అమ్మవారి క్షేత్రం మహిమాన్విత శక్తిపీఠం అని శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతీస్వామి అన్నారు. విజయ యాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి క్షేత్రానికి చేరుకున్న ఆయన శనివారం ఉదయం ఆలయాలను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు అర్చక స్వాములతో కలిసి శృంగేరి పీఠాధిపతులను పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శృంగేరి పీఠాధిపతులు జోగుళాంబ ఆలయంలో శ్రీచక్రార్చనలు, కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు, విశేష పూజలు చేశారు. స్థానికంగా ఉన్న కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని సందర్శించి అక్కడ పూజలు నిర్వహించారు. పూజల అనంతరం క్షేత్ర పరిసరాల్లోని నవ బ్రహ్మ, కంచి కామాక్షమ్మ ఆలయాలను సందర్శించి.. శిల్పకళా నైపుణ్యాలను పరిశీలించారు. అలాగే పురావస్తు శాఖ మ్యూజియానికి వెళ్లి అక్కడి ప్రాచీన శిల్పాలు, విగ్రహాలను పరిశీలించడం జరిగింది. అనంతరం జోగుళాంబ అమ్మవారి ఆలయంలో భక్తులకు ప్రవచనం చేశారు. ఎమ్మెల్యే విజయుడు శృంగేరి పీఠాధిపతులను దర్శనం చేసుకున్నారు. క్షేత్ర అభివృద్ధిపై పీఠాధిపతులకు వినతిపత్రం అందజేశారు.

శృంగేరి పీఠాధిపతులు

భారతీస్వామి

Advertisement
 
Advertisement
Advertisement