నేతన్నలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నేతన్నలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి

Mar 8 2026 7:36 AM | Updated on Mar 8 2026 7:36 AM

రాజోళి: చేనేత కార్మికులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నూతన ఉత్పాదకాలను మార్కెట్‌లోకి తీసుకురావాలని పట్టు పరిశ్రమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ లత అన్నారు. శనివారం మండల కేంద్రం రాజోళిలో సెంట్రల్‌ సిల్క్‌ బోర్డు సైంటిస్టులు దీపక్‌ చౌహాన్‌, సంజయ్‌ గుప్తాలతో కలిసి ఎలక్ట్రానిక్‌ జాకాట్‌పై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా చేనేత కార్మికులకు మగ్గాలపై, పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఎలక్ట్రానిక్‌ జాకాట్ల వినియోగంతో కార్మికులకు కలిగే మేలును వివరించారు. ప్రధానంగా గుంత మగ్గాలు, ఫ్రేమ్‌ మగ్గాలపై ఎలక్ట్రానిక్‌ జాకాట్లను వినియోగించడంలో కార్మికులకు ఉన్న అపోహలను తొలగించుకోవాలని, ఏ మగ్గాల ౖపైనెనా ఇబ్బందులు లేకుండా ఎలా వాడాలనే విషయాలను తెలియజేశారు. ఎలక్ట్రానిక్‌ జాకాట్లపై 75 శాతం రాయితీ ఉందని, వాటిపై పూర్తి స్థాయిలో శిక్షణ అందించి కార్మికులను తీర్చి దిద్దుతామని, ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం గుంత మగ్గాలపై తయారు చేసిన చీరలను పరిశీలించారు. వాటిలో వాడుతున్న సిల్క్‌ ఇతర సామగ్రి వివరాలను అడిగి తెలసుకుని, కార్మికులతో చర్చించారు. కార్యక్రమంలో సెంట్రల్‌ బోర్డు టెక్నికల్‌ అసిస్టెంట్‌ అశోక్‌ దేశాయ్‌, హ్యాండ్లూమ్‌ డీఓ సుధారాణి, సర్పంచ్‌ గంగిరెడ్డి, దోత్రే నారాయణ, చేనేత కార్మికులు పాల్గొన్నారు.

పట్టు పరిశ్రమ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ లత

Advertisement
 
Advertisement
Advertisement