కాళేశ్వరం : మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో రూ.1.20కోట్ల వ్యయంతో మ్యూజియం నిర్మించారు. ఈ ఏడాదిలో నిర్వహించిన సరస్వతీనది అంత్య పుష్కరాల సందర్భంగా మొదటి రోజు గవర్నర్ శివప్రతాప్‌శుక్లా, కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతిస్వామి, మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. మ్యూజియంలో కాకతీయులు, చాళుక్యుల కాలం నాటి పురాతన విగ్రహాలు, వాటి పేర్లు ఇతర వివరాలు పొందుపరిచారు. కాళేశ్వరం దేవస్థానం జీర్ణోద్దరణ నేపథ్యంలో ఆదిముక్తీశ్వరాలయంలోకి మార్చారు. ఈ సాకుతో మ్యూజియం మూసి ఉంటుందని భక్తుల నుంచి ఆరోపణలు ఉన్నాయి. పుష్కరాల అనంతరం భక్తులకు మ్యూజియం తెరిచి ఉన్న దాఖలాలు మాత్రం లేవని తెలిసింది. కాగా మ్యూజియం పనులు కూడా ఇంకా అసంపూర్తిగానే దర్శమిస్తున్నాయి. మ్యూజియం పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.


