ఆధారం చూపితేనే ఓటు | - | Sakshi
Sakshi News home page

ఆధారం చూపితేనే ఓటు

Aug 24 2026 1:07 AM | Updated on Aug 24 2026 1:07 AM

ములుగు: ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా ములుగు నియోజక వర్గం పరిధిలో అధికారులు నో మ్యాపింగ్‌, అనామలిస్‌ (గుర్తింపు లేని) ఓటర్లకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఎన్యుమరేషన్‌ ఫారాలను సేకరించిన అధికారులు డిజిటలైజేషన్‌ చేసి ఈనెల 14న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. ఇందులో 2,09,128 మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. జిల్లాలో నో మ్యాపింగ్‌, అనామలిస్‌ కలిపి 41,412 మంది ఓటర్లకు నేటి నుంచి నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అయితే ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ నోటీసులు ఎవరికి వస్తాయోనని ఓటర్లలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నోటీసులు అందుకున్న పక్షం రోజుల్లోగా ఈఆర్‌ఓలకు సరైన ఆధారం చూపితేనే తుది జాబితాలో ఓటు దక్కనుంది. ముసాయిదా ఓటరు జాబితాకు తుది ఓటరు జాబితాకు భారీ వ్యత్యాసం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బీఎల్‌ఓ, బీఎల్‌ఏలే కీలకం

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు దక్కాలంటే బీఎల్‌వో, బీఎల్‌ఏల పాత్ర కీలకంగా మారనుంది. సర్‌ ప్రక్రియలో భాగంగా ఈ నెల 19న అన్ని రాజకీయ పార్టీల నేతలతో అధికారులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న బీఎల్‌వోలు ఓటర్లకు సర్‌ ప్రక్రియపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఓటర్లకు నోటీసులు అందజేసే సమయంలో దాని ఉద్దేశం, ఆ తర్వాత చేపట్టాల్సిన చర్యలు, అవసరమైన ధ్రువపత్రాల వివరాలను స్పష్టంగా తెలియజేయాల్సి ఉంది. డిక్లరేషన్‌ ఫారాల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబరు 16 వరకు కొనసాగనుంది. నోటీసులు, రీ–హియరింగ్‌, క్లెయిమ్స్‌కు సంబంధించిన ప్రక్రియ వచ్చేనెల 20వ తేదీ వరకు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. అర్హత కలిగిన ప్రతీ ఓటరుకు ఓటుహక్కు కల్పించడంతో పాటు, ఓటర్ల జాబితా విశ్వసనీయంగా ఉండేలా సమష్టిగా కృషి చేసేందుకు నాయకులు సహకారం అందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బీఎల్‌ఏలు, బీఎల్‌వోలు ఓటర్లకు అందించే సహకారంతోనే సర్‌ ప్రక్రియ విజయవంతం కానుంది.

జిల్లాలో 41,412 మందికి

సర్‌ నోటీసులు

నేటి నుంచి అందించనున్న బీఎల్‌ఓలు

రాజకీయ పార్టీలతో

ముగిసిన సమావేశం

12 రకాల ధ్రువపత్రాలు..

ముసాయిదా ఓటరు జాబితాలో వివరాలు తప్పుగా ఉండి పేరు, ఇంటి పేరు, చిరునామా అక్షర దోషాలు ఉన్నట్లు గుర్తించిన అనామలిస్‌ (గుర్తింపు లేని) ఓటర్లే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మ్యాపింగ్‌ కానీ ఓటర్లకు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. నియోజకవర్గంలో నో మ్యాపింగ్‌ ఓటర్లు 11,308 మంది, అనామలిస్‌ ఓటర్లు 30,104 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరికి బూత్‌ స్థాయి అధికారులతో నేటి నుంచి నోటీసులు ఇవ్వనున్నారు. ఎన్నికల సంఘం తెలిపిన 12 రకాల ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి చూపి ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. నోటీసులు అందుకున్న వార్లు సక్రమంగా స్పందిస్తేనే అనామలిస్‌ ఓటర్లు తగ్గే అవకాశం ఉంటుంది.

9,589

3,586

6,633

2,227

5,342

648

4,945

3,772

3,056

1,614

మంగపేట

ఏటూరునాగారం

ములుగు

గోవిందరావుపేట

కొత్తగూడ

మల్లంపల్లి

వెంకటాపురం(ఎం)

ఎస్‌ఎస్‌తాడ్వాయి

కన్నాయిగూడెం

గంగారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement