● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవన్‌కుమార్
భూపాలపల్లి అర్బన్: సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో పెద్దఎత్తున కేసులను పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్ జె.జీవన్‌కుమార్ సూచించారు. శనివారం న్యాయవాదులు, ఇన్సూరెన్స్ కంపెనీల మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. రాజీ పడదగిన సివిల్, క్రిమినల్, మోటార్ వాహన, మ్యాట్రిమోనియల్, చెక్ బౌన్స్ తదితర కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎ.రాములు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదులాపురం శ్రీనివాస్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పుప్పాల శ్రీనివాస్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కె.అక్షయ, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఇందారపు శివకుమార్ పాల్గొన్నారు.


