● అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్
టేకుమట్ల: సాదాబైనామాకు రికార్డులను సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు సాదాభైనామా, భూభారతి రికార్డులను పరిశీలించి, సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న పైళ్లను వెంటనే పూర్తిచేయాలని తహసీల్దార్ స్వరూపరాణిని ఆదేశించారు. కార్యాలయంలోని అన్ని రికార్డులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ సంతోష్‌బాబు, సీనియర్ అసిస్టెంట్ విజయ్‌కుమార్, జీపీఓ, జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు.


