●
సాక్షి, మహబూబాబాద్:
బంజారా యువతులు సంబురంగా జరుపుకునే పండుగ తీజ్. తీజ్ అంటే గోధుమ నారు. ప్రకృతి శ్రావణంలో వర్షాలు కురిసి ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఈ సీజన్‌లో కనిపించే ఎర్రని వర్ణం గల ఆరుద్ర పురుగులను కూడా తీజ్ అని పిలుస్తారు. అంతటి అందమైన పురుగులను దేవుడు మనకోసమే కిందికి పంపిస్తాడని, ఈ పురుగులు కనిపించినప్పుడు యువతులు మనస్సులో కోరుకున్న కోరిక ఫలిస్తుందనేది గిరిజనుల నమ్మకం. ఈనేపథ్యంలో గోధుమలు బుట్టల్లో అలికి రోజూ నీళ్లు పోస్తే ఆరుద్ర పురుగులాంటి అందం, మంచి నడవడిక, బుద్ధి, సంపదలతో కూడిన వరుడు దొరుకుతాడని గిరిజనులు నమ్ముతారు. ఈనమ్మకం వందల ఏళ్ల కిందట మొదలై రోజురోజుకూ ఆధునిక హంగులు అద్దుకుంటోంది.
తొమ్మిది రోజుల తంతు
పెళ్లీడుకు వచ్చిన యువతి తనకు కావాల్సిన పెళ్లికొడుకు కోసం చేసే ఈ పండుగలో ముందుగా తల్లిదండ్రులు, తర్వాత పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. ముఖ్యంగా తండా పెద్ద నాయక్ అనుమతి పొందిన తర్వాత పండుగ తంతు మొదలు పెడతారు. తీజ్ (గోధుమ మొలకలు) ఏపుగా పెరిగేందుకు ఆడపిల్లలు అడవికి వెళ్లి దుస్సేరు (ఫిలోణీర్ వేళ్లీ) తెస్తారు. ఈ తీగలతో అందమైన బుట్టలను అల్లుతారు. లంబాడీల ఆరాధ్య దైవం తుల్జా భవానీ, సేవాలాల్ మహరాజ్, సీత్లాభవానీలకు పూజలు చేసి స్నానాలు ఆచరించి పవిత్రతతో పుట్టమట్టిని తెస్తారు. లంబాడీ భాషలో బోరడీ ఝుష్కేరో అంటే రేగుముళ్లు గుచ్చడం.
గోధుమబుట్టల్లోని నారుకు నీరు పోస్తున్న యువతి
గోధుమ నారు పెంచి..
కోరుకున్న వరుడి కోసం పూజలు
ఉమ్మడి జిల్లాలో బంజారాల సంబురం
నూతన అలంకరణలతో ఉత్సవం


