● మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి: కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డిది రాజకీయ యాత్ర అని, కేంద్ర కేబినెట్‌లో ఉండి సింగరేణి కార్మికులకు ఏం భరోసా ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో, ఇప్పుడు కేంద్రమంత్రి పదవుల్లో ఉండి ఈ ప్రాంతానికి కిషన్‌రెడ్డి ఒరగబెట్టిందేమీ లేదన్నారు. సింగరేణి ప్రాంతంలో పర్యటించినప్పుడు సింగరేణి చైర్మన్, డైరెక్టర్లను పిలిపించి, సమీక్ష నిర్వహించి ఇక్కడి సమస్యలు పరిష్కరించరాదా.. అని ప్రశ్నించారు. తాడిచర్ల బ్లాక్ –2ను సింగరేణికి కేటాయించామని చెబుతున్న మంత్రి.. కోయగూడెం, సత్తుపల్లి తదితర బ్లాక్‌లను సంస్థకు ఎందుకు కేటాయించలేదన్నారు. ఐటీ రద్దు, మెడికల్ అన్‌ఫిట్‌లు జరగక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సింగరేణిలో ఓపెన్‌కాస్ట్ టెండర్లలో అవినీతి జరుగుతుందని, ఓబీ టెండర్లు ఎక్సెస్ రేట్లకు పోవడం మూలంగా కంపెనీ నష్టపోతుందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. గండ్ర హరీష్‌రెడ్డి, కట్ల పూర్ణచందర్, నరేందర్, మాడ హరీశ్‌రెడ్డి, దేవరకొండ మధు, నూనె రాజు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు
భూపాలపల్లి అర్బన్: సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బుధవారం భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సూపర్ ఎల్‌నినో, కరువు పరిస్థితులపై మీడియా అడిగిన ప్రశ్నకు సీఎం స్పందిస్తూ ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని గండ్ర పేర్కొన్నారు.


