ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం

Jul 15 2026 12:41 AM | Updated on Jul 15 2026 12:41 AM

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

భూపాలపల్లి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగంవతం చేయాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జాప్యం జరగకూడదన్నారు. మొదటి దశలో 4,437 ఇళ్లు మంజూరుకాగా.. 712మంది ఇంకా పనులు ప్రారంభించలేదన్నారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించి ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీకాంత్‌, శిక్షణ డిప్యూటీ కలెక్టర్‌ నవీన్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌, ఎంపీడీఓలు పాల్గొన్నారు.

20లోగా ఎస్‌ఐఆర్‌ పూర్తిచేయాలి

గణపురం: ఈ నెల 20వ తేదీలోగా ఓటర్ల సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తిచేయాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ ఆదేశించారు. గణపురం మండలకేంద్రంలో ఓటర్ల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఓటర్ల జాబితా సవరణ అత్యంత బాధ్యతాయుతమైన ప్రక్రియ అని గడువులోగా వందశాతం పూర్తి చేయడానికి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం గణపురం మోడల్‌ పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణను కలెక్టర్‌ పరిశీలించారు. గణపురంలో ఎరువుల విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, పశు సంవర్ధక శాఖ డీడీ డాక్టర్‌ కుమారస్వామి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు, తహసీల్దార్‌ రాజేశ్వర్‌రావు, ఎంపీడీఓ భాస్కర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement