పత్తి మొక్కల ఎండిపోకుండా నీరు పెట్టిన రైతు
మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామానికి చెందిన రైతు కమటం రాజయ్య తనకున్న నాలుగు ఎకరాల చేనులో వారం రోజుల కిందట ఎంతో ఆశతో పత్తి విత్తనాలు వేశారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షం జాడలేదు. పగటిపూట ఎండలు దంచికొడుతుండడంతో ఇప్పుడిప్పుడే మొలకెత్తిన లేత మొక్కలు ఎండిపోయే ప్రమాదం ఉంది. పెట్టుబడితో పాటు శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని రైతు భావించి.. తప్పనిసరి పరిస్థితుల్లో వ్యవసాయ మోటార్‌పై ఆధారపడి నాలుగు ఎకరాలకు ఓ పైపును అడ్డంగా పెట్టి సాలుకు ఓ రంధ్రం చేసి రెండురోజులుగా పైపుతో నీరు పెడుతున్నాడు. వర్షం పడకపోతే కాపాడుకుంటున్న పంట కూడా చేజారిపోతుందనే భయం రాజయ్య లాగా జిల్లావ్యాప్తంగా ఎందరో రైతులను రాత్రిళ్లు నిద్రపోనివ్వడం లేదు.
– కాళేశ్వరం


