సాక్షిప్రతినిధి, వరంగల్: వానాకాలం ప్రారంభమై నెల దాటినా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆశించిన వేగంతో సాగు ముందుకు సాగట్లేదు. శుక్రవారం నాటికి 79 మండలాలకు 52 మండలాల్లో లోటు, భారీ లోటు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించడం, ఆతర్వాత కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు విత్తనాలు వేయడంలో వెనుకంజ వేస్తున్నారు. పత్తి సాగు చేసిన రైతులు అవి మొలకెత్తక ఆందోళన చెందుతుండగా.. వరి రైతులు పొలాల్లో ముదిరిపోతున్న నారును చూసి దిగులు పడుతున్నారు. వానాకాలం సాగులో ముందుకెళ్లడమా? ఆగిపోవడమా? తేల్చుకోలేకపోతున్నారు.
వానాకాలం సాగు లెక్క ఇలా..
రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన సీజన్ అండ్ క్రాప్ కవరేజ్ నివేదిక ప్రకారం ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో 15.93 లక్షల ఎకరాల సాగు లక్ష్యానికి గాను ఇప్పటివరకు 5,00,220 ఎకరాల్లో మాత్రమే సాగు పూర్తయ్యింది. అంటే మొత్తం లక్ష్యంలో 31.42 శాతం మాత్రమే సాగైంది. ఇందులో వరి లక్ష్యం 9.21 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 36,201 ఎకరాల్లో (3.9 శాతం) మాత్రమే సాగయ్యింది. ప్రధాన పంటగా కొనసాగుతున్న పత్తి 5,94,102 ఎకరాల లక్ష్యానికిగాను 4,19,605 (70.62 శాతం) ఎకరాల్లో పత్తి సాగైంది. వరి నాట్లు వేసేందుకు రైతులు ఇంకా వర్షాలపై ఆధారపడి ఉండగా.. పత్తి సాగు ఎక్కువగా పూర్తయింది. అయితే మొలకెత్తని, ఎండిపోతున్న పత్తి పంట సైతం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.
52 మండలాల్లో లోటు, భారీ లోటు..
79 మండలాలకు గాను ఈ వానాకాలంలో ఇంకా 52 మండలాల్లో లోటు, భారీ లోటు వర్షపాతమే ఉంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, హసన్‌పర్తి, కాజీపేట, హనుమకొండ, ఆత్మకూరు, శాయంపేట, వరంగల్ జిల్లా గీసుకొండ, నర్సంపేట, ఖిలావరంగల్, వరంగల్ మండలాల్లో భారీగా లోటు వర్షపాతం ఉంది. అలాగే హనుమకొండ జిల్లాలో 8, వరంగల్‌లో 8, జనగామలో 7, మహబూబాబాద్‌లో 12, జేఎస్ భూపాలపల్లిలో 7 మండలాలు కలిపి 42 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఆరు జిల్లాల్లో అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 41.15 శాతం సాగు పూర్తైంది.
జిల్లాల వారీగా సాగు లక్ష్యం, సాగైంది., శాతం(ఎకరాల్లో)
సాగు శాతం
– వేంకటేశ్వరరావు, రైతు, కక్కిరాలపల్లి
కలిసిరానికాలం అన్నదాత అయోమయం
ములుగు మినహా ఐదు జిల్లాల్లో
లోటు వర్షపాతం
79 మండలాలకు 52 మండలాల్లో
లోటు, భారీ లోటు
వాన జాడ లేదు, సాగు జోరు లేదు..
ఇప్పటికీ 31.42 శాతమే సాగు
15.93 లక్షల ఎకరాలు సాగు లక్ష్యం.. 5,00,220 ఎకరాల్లోనే సాగు
కాడెత్తేసిన వరి రైతు.. 9,21,445కు 36,201 ఎకరాల్లో సాగు
70.62 శాతంగా పత్తి సాగు..
మొలకెత్తని రైతుల ఆశలు
రైతులకు చుక్కలు చూపుతున్న
వానాకాలం సాగు
జిల్లా సాధారణ నమోదైన వర్షం లోటు /
వర్షపాతం (మి. మీలలో) అధికం
భూపాలపల్లి 217.3 178.6 –17.8
హనుమకొండ 194.6 85.8 –55.9
వరంగల్ 203.2 113.5 –44.1
జనగామ 163.9 131.0 –20.1
మహబూబాబాద్ 186.2 161.0 –13.5
ములుగు 262.5 292.5 +11.4
జిల్లా సీజన్ లక్ష్యం ఇప్పటి వరకు సాగు
(ఎకరాలు) సాగు శాతం
హనుమకొండ 2,38,964 76,982 32.21
వరంగల్ 2,81,943 97,619 34.62
జనగామ 3,59,281 1,40,359 39.07
మహబూబాబాద్ 3,71,318 76,902 20.71
ములుగు 1,29,824 21,261 16.38
జేఎస్ భూపాలపల్లి 2,11,670 87,097 41.15
31.42
వానల కోసం ఎదురు చూస్తున్నా
ఐనవోలు: నాకు చెలుక, పొలం కలిపి 7.5 ఎకరాల వరకు ఉంది. 3 ఎకరాల్లో పత్తి, ఎకరం పసుపు సాగు చేస్తున్న. వానలు సరిగ్గా కురవక రెండుసార్లు పత్తి విత్తనాలు పెట్టాల్సి వచ్చింది. వ్యవసాయ అధికారుల సూచన మేరకు 2 ఎకరాల్లో పల్లికాయ వేశాను. మిగిలిన ఎకరంన్నరలో తిండి గింజల కోసం వరి సాగు కోసం వర్షాల కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పటికే పెట్టుబడి 60 వేలు దాటింది. ఏటా మాదిరిగా వానలు సరిగ్గా కురవకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. సరైన వర్షాలు కురవకపోతే తీవ్రంగా నష్టపోతాం.
పత్తి మొలకలు ఎండుతున్నాయి
కొన్ని రోజుల క్రితం కురిసిన తొలకరి జల్లులకు 3 ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటడంతో మొలకెత్తాయి. ప్రస్తుతం సరైన వర్షాలు కురవకపోవడంతో పత్తి మొలకలు ఎండిపోతున్నాయి. విత్తనాలు, ఎరువుల కోసం భారీగా పెట్టుబడులు పెట్టి ఆందోళన చెందుతున్నాం. రెండు, మూడు రోజుల్లో వర్షాలు కురవకపోతే మొత్తం మొలకలు ఎండిపోతాయి.
– హింగే మనోహర్, రైతు, పీచర


