● ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు
భూపాలపల్లి: ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సభకు ఆర్టీసీ బస్సులను పంపించడంతో జిల్లాలో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భూపాలపల్లి డిపోలో 95 బస్సులు ఉండగా 61 బస్సులను గురువారం రాత్రి నుంచే సీఎం సభకు తరలించారు. మిగిలిన 34 బస్సులను మాత్రమే శుక్రవారం నడిపించారు. దీంతో పరకాల, హనుమకొండ, హైదరాబాద్, గోదావరిఖని, మంచిర్యాల వైపు వెళ్లే ప్రయాణికులు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటకో బస్సు రావడంతో సీట్ల కోసం నానా తంటాలు పడ్డారు. చివరకు చేసేది లేక బస్సులో నిలబడి వెళ్లారు.


