మహాముత్తారం, యామన్‌పల్లి, బోర్లగూడెం, నిమ్మగూడెం తదితర గ్రామాల్లో సీసీరోడ్లు నిర్మించారు కానీ సైడ్‌కాల్వలు నిర్మించలేదు. దీంతో ఆయా గ్రామాల్లోని ప్రధాన రహదారుల పైనుంచి మురుగునీరు పారుతోంది. వర్షాకాలం వచ్చిందంటే రోడ్లుపై మురుగునీరు చేరి దుర్వాసన వెదజల్లుతోంది. యామన్‌పల్లి ప్రధాన కూడలి వద్ద నిత్యం నీరు పారడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి డ్రెయినేజీలు నిర్మించి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలని కోరుతున్నారు. – మహాముత్తారం
యామన్‌పల్లి ప్రధాన రహదారిపై పారుతున్న మురుగునీరు


