ప్రజల భాగస్వామ్యం కీలకం | - | Sakshi
Sakshi News home page

ప్రజల భాగస్వామ్యం కీలకం

Jul 8 2026 1:08 AM | Updated on Jul 8 2026 1:08 AM

పలిమెల: గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున కార్డన్‌సెర్ఛ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్‌ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతో గ్రామాల్లో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయడంతో పాటు అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ఇటువంటి ప్రత్యేక కార్డన్‌సెర్చ్‌ ఆపరేషన్లు నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలిమెల ఎస్‌హెచ్‌ఓ టి.సాయిశశాంక్‌, మహదేవపూర్‌ ఎస్సై సాంబమూర్తి, కాళేశ్వరం ఎస్సై తమాషారెడ్డి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

డీఎస్పీ సూర్యనారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement