● సహకార సంఘాలను బలోపేతం చేయాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: బాలలు సమాజ సంపద అని, వారు బడిలో ఉండాలని, పనులలో కాదని కలెక్టర్ రాహుల్‌శర్మ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో ఆపరేషన్ ముష్కాన్ జిల్లాస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని శాఖల సమన్వయంతో బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలన్నారు.
కలెక్టర్‌కు ఎన్యుమరేషన్ ఫారం అందజేత..
కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ శర్మకు సోమవారం బీఎల్‌ఓ సదయ్య, సూపర్‌వైజర్ జితేందర్ ఎన్యుమరేషన్ ఫారం అందజేశా రు. కలెక్టర్ రాహుల్ శర్మకు 79వ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు నమోదు చేసుకోగా ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఫారం అందజేశారు.
వ్యాధులు సంక్రమించకుండా జాగ్రత్తలు..
జంతువుల ద్వారా మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జునోసిస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ మధుసూదన్, డీఆర్‌ఓ వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి..
ప్రజావాణి దరకాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 112 నుంచి వినతులు స్వీకరించారు.
ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలి..
ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్న నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికి ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డివార్మింగ్ డే ముందస్తు ఏర్పాట్లపై వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.
సంఘాలను బలోపేతం చేయాలి..
సహకార సంఘాలను బహుళ సేవ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో సహకార శాఖ ఆధ్వర్యంలో సహకార వారోత్సవాల అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి వాలియా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
99.21 శాతం ఫారాల పంపిణీ పూర్తి..
జిల్లాలో 99.21 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.


