ప్రవేశాలు పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రవేశాలు పూర్తిచేయాలి

Jul 7 2026 1:01 AM | Updated on Jul 7 2026 1:01 AM

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాలోని కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలను పూర్తి చేయాలని ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జిల్లాలో 11 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు), 6 ఆదర్శ పాఠశాలల స్పెషల్‌ ఆఫీసర్లు, ప్రిన్సిపాళ్లతో కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో విజయలక్ష్మి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి పాఠశాలలో పూర్తి స్థాయిలో ప్రవేశాలు కల్పించాలని, యూడైస్‌ ప్లస్‌లో నమోదైన విద్యార్థులందరూ హాస్టల్‌కు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. హాజరు 95 శాతానికి తగ్గకుండా చూడాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.రాజేందర్‌ మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వర్షాకాలంలో హాస్టళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జీసీడీఓ శైలజ, ఏఎంఓ పింగిళి విజయపాల్‌రెడ్డి, ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ దుప్పటి రాజగోపాల్‌ స్పెషల్‌ ఆఫీసర్లు, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement